newsseals.com

బీసీలను వేధించిన జగన్ : కొల్లు రవీంద్ర

August 17, 2026 · VijayaBhaskar

విజ‌య‌వాడ : రాష్ట్రంలో బీసీల‌ను కావాల‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వేధింపుల‌కు గురి చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. అందుకే జ‌నం త‌న‌ను బండ‌కేసి కొట్టార‌ని అయినా బుద్ది రావ‌డం లేద‌న్నారు. కేవ‌లం త‌న పార్టీని, త‌న‌ను 11 సీట్ల‌కే ప‌రిమితం చేసినా ఇంకా చిల్ల‌ర వేషాలు వేస్తున్నారంటూ మండిప‌డ్డారు. బ‌హుజ‌నుల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. గౌతు లచ్చన్న స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు అన్నింటా బీసీలకు పెద్ద పీట వేస్తున్నారని మంత్రి తెలిపారు. త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నారని ప్ర‌క‌టించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాతినిథ్యం పెంచేలా చర్యలు తీసుకొంటున్నారని చెప్పారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. బీసీల పతనాన్ని జగన్ కోరుకున్నారన్నారు. తప్పుడు కేసులు పెట్టి, తనతో సహా ఎందరో బీసీలను జైల్లో పెట్టారన్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తనపై హత్య కేసు సైతం బనాయించారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు అన్నింటా బీసీలకు అండగా నిలుస్తున్నారన్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. బీసీల సంక్షేమం కోరుతూ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా బీసీ యువతకు అండగా నిలుస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు.

Related News