newsseals.com

నా టార్గెట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు : కొండా సుష్మిత

August 21, 2026 · VijayaBhaskar

వరంగ‌ల్ జిల్లా : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, కొండా ముర‌ళి కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ సంజాయిషీ కోరింది. ఈ మేర‌కు కొండా సురేఖ‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కొండా సుష్మిత‌. శుక్ర‌వారం ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీని విమ‌ర్శించ లేద‌న్నారు. ఏనాడూ పార్టీ లైన్ దాట‌లేద‌ని అన్నారు. న‌డ‌వ‌లేని వ్య‌క్తి రేవూరి ప్ర‌కాష్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. పార్టీ నియ‌మ నిబంధ‌న‌ల‌ను తోసి రాజ‌ని కామెంట్స్ చేసింది తాను కాద‌ని , సీఎం రేవంత్ రెడ్డి అని మ‌రోసారి సీరియ‌స్ కామెంట్స్ చేశారు సుష్మిత‌.

నేను కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు, రేవంత్ రెడ్డిని విమర్శించానన‌ని అన్నారు. ఇందులో త‌న త‌ప్పు ఏమీ లేద‌న్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ , ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ అంటే త‌న‌కు కూడా గౌర‌వం ఉంద‌న్నారు కొండా సుష్మిత‌. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి, అతని సోదరులు విపరీతమైన అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అందుకే అతన్ని టార్గెట్ చేశానని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి అతనికి ఏం అధికారం ఉంది అని ప్ర‌శ్నించారు. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ప్ర‌క‌టించారు కొండా సుష్మిత‌. వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

Related News