newsseals.com

రేవంత్ రెడ్డి వ‌ర్సెస్ కొండా సురేఖ

August 21, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. విదేశీ ప‌ర్య‌ట‌నలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యింది. కేంద్రం త‌న‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. దీంతో లండ‌న్ లో ఉన్న ఆయ‌న అక్క‌డ స‌మావేశాల‌లో పాల్గొని తిరిగి ప్ర‌యాణం అవుతారు. ఇదే క్ర‌మంలో తాను ఓరుగ‌ల్లు వేదిక‌గా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. ఈ సంద‌ర్బంగా ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాష్ రెడ్డికి తిరిగి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ కామెంట్ తో భ‌గ్గుమ‌న్నారు మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీకి చెందిన కొండా దంప‌తుల కూతురు సుష్మిత తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌న సోద‌రుల బండారం బ‌య‌ట పెడ‌తానంటూ ప్ర‌క‌టించారు. అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డిపై వ్య‌క్తిగ‌తంగా తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీలో అచ్చ కాంగ్రెస్ వ‌ర్సెస్ ప‌చ్చ కాంగ్రెస్ గా మారి పోయింద‌ని కూడా కొండా సుస్మిత మండిప‌డ్డారు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. తానే ప‌ర‌కాల నుంచి పోటీ చేస్తానంటూ ఎవ‌రు వస్తారో రావాల‌ని కూడా స‌వాల్ విసిరారు. ఈ త‌రుణంలో కొండా సురేఖ‌తో పాటు చిన్నారెడ్డి , అనిరుధ్ రెడ్డికి కూడా క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ నోటీసులు జారీ చేసింది. ఈ దెబ్బ‌తో కంట్రోల్ త‌ప్పింద‌ని భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఉన్న‌ట్టుండి త‌న సీటుకు ఎస‌రు వ‌స్తుంద‌ని గ్ర‌హించారు. ఆ వెంట‌నే త‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకుని తిరుగు ప్ర‌యాణం అయ్యారు.

Related News