newsseals.com
ENTERTAINMENT

యష్‌ను కలవడం చాలా ఆనందాన్నిచ్చింది

Posted by: VijayaBhaskar August 24, 2026
newsseals-AnupamKher

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. సోమ‌వారం ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా పాన్ ఇండియా స్టార్ హీరో య‌శ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. త‌న‌ను క‌లిసిన సంద‌ర్బంగా దిగిన ఫోటోల‌ను షేర్ చేశాడు. యష్ అనే అద్భుత నటుడు అని, త‌న‌ను కలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది అని పేర్కొన్నాడు అనుప‌మ్ ఖేర్. కేజీఎఫ్‌, కేజీఎఫ్ -1 చిత్రాల‌ను చూశాను. అత‌డు క‌న‌బ‌ర్చిన న‌ట‌న త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునేలా చేసింద‌న్నాడు. అతను కేవలం రాకీ పాత్రను పోషించడమే కాదు ఆ పాత్రకు ఒక ప్రాణాన్ని, ఒక ప్రత్యేకమైన హుందాతనాన్ని ఇచ్చి, భారతీయ చిత్రసీమలో ఒక చెరగని స్థానాన్ని కల్పించాడని ప్ర‌శంసించాడు.

ఆ శక్తివంతమైన తెరపై ఉనికి వెనుక నేను ఒక ఆత్మీయమైన, ఒదిగి ఉండే , ఆలోచనాపరుడైన వ్యక్తిని కనుగొన్నానని అని తెలిపాడు అనుఫ‌మ్ ఖేర్. మేము ఒక స్టూడియోలో కలుసుకుని సినిమా, జీవితం, తల్లిదండ్రులు, కుటుంబాలు, కలలు , మనల్ని తీర్చిదిద్దే ప్రయాణాల గురించి మాట్లాడుకున్నామన్నాడు. అసాధారణమైన దాన్ని సృష్టించాలనే తపనతో, అభిరుచితో ఉన్న ప్రతిభావంతులైన యువ నటులను కలిసినప్పుడల్లా నాకు కొత్త శక్తి వస్తుంది. వారిలోని ఆ నిప్పు నన్ను మరింత కష్టపడి పని చేయడానికి, లోతుగా అన్వేషించడానికి , నా వంతు ఉత్తమమైనది ఇవ్వడానికి ప్రేరేపిస్తుందన్నాడు. బహుశా అదే సినిమా అందం! మనం వేర్వేరు తరాలకు చెందిన వారమైనా, మన కలలు ఒకే భాషను మాట్లాడతాయని పేర్కొన్నాడు. త‌ను తాజాగా న‌టించిన టాక్సిక్ స‌క్సెస్ సాధించాల‌ని కోరారు.