newsseals.com
News

‘టామ్ కామ్’ ద్వారా యువ‌త‌కు ఉపాధి క‌ల్ప‌న

Posted by: VijayaBhaskar August 26, 2026
newsseals-DasariHaarichandana

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని టామ్ కామ్ (TOMCOM _ ద్వారా రాష్ట్ర యువతకు సురక్షితమైన విదేశీ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని శక్తి, కార్మిక‌ శాఖ కార్యదర్శి దాస‌రి హరిచందన తెలిపారు. అంతర్జాతీయ వర్క్‌ఫోర్స్ మొబిలిటీలో టామ్‌కామ్‌ను విశ్వసనీయ ప్రభుత్వ భాగస్వామిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. టామ్‌కామ్‌తో కలిసి జపాన్ కంపెనీలు పనిచేసి తెలంగాణ యువతకు మరిన్ని అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆమె కోరారు. డిసెంబర్ 2026లో నిర్వహించనున్న రైజింగ్ తెలంగాణ సదస్సులో జపాన్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు పాల్గొనాలని ఆహ్వానించారు.

ఒసాకా–కోబేలో భారత కాన్సుల్ జనరల్ చంద్రు అప్పర్ మాట్లాడుతూ భారత్–జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో వర్క్‌ఫోర్స్ మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. భారత ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని ప్రస్తావించారు. ఐదేళ్లలో భారత్–జపాన్‌కు 5 లక్షల మంది మానవ వనరులు అవసరమని, అందులో 50 వేల మంది నైపుణ్యవంతులైన సిబ్బంది, ప్రతిభావంతులైన మానవ వనరులు అవసరమవుతారని తెలిపారు. భారత్ నుంచి మరింత మంది నైపుణ్యవంతులైన యువతకు జపాన్‌లో అవకాశాలు కల్పించే దిశగా Career Consultz, TOMCOM చేస్తున్న కార్యక్రమాలకు అవసరమైన సహకారం అందిస్తామని చంద్రు అప్పర్ హామీ ఇచ్చారు.