newsseals.com

పెనుకొండ లోనే పుట్టా..ఇక్క‌డే చ‌నిపోతా

August 27, 2026 · VijayaBhaskar

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు. ‘నాది పెనుకొండే… ఇక్కడే పుట్టా… ఇక్కడే పెరిగా…ఇక్కడే పోయేది… నా గురించి పెనుకొండ నియోజక వర్గ వాసులందరికీ తెలుసు. నా ఇంటికొస్తే శత్రువుకైనా కాఫీ సాగునంపుతా… ఇదీ నా నైజం… నా కార్యకర్తలపై, బంధువులపై తప్పుడు కేసులు పెట్టడం నాకు చేతకాదు అని మంత్రి సవిత అన్నారు. తమ నాయకుడు రప్పా రప్పా నరకమని, కబ్జాలు, దోపీడీలు చేయమని చెప్పలేదని న్నారు. తమకు సభ్యత, సంస్కారం నేర్పారని, వైసీపీ నాయకులకు దమ్ముంటే అభివృద్ధిపైనా చర్చకు రావాలని స‌వాల్ విసిరారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఒక్క రోడ్డూ కూడా నిర్మించలేదని మంత్రి సవిత మండిపడ్డారు. జలజీవన్ మిషన్ నిధులు కూడా వినియోగించలేని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు.

ఒక డీఎస్సీని కూడా జగన్ నిర్వహించలేక పోయారన్నారు సవిత‌. కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ నిర్వహించిందన్నారు. ఆ డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ జగన్ కడుపు మంట తీర్చుకుంటున్నారన్నారు. ఇకపై ఏటా డీఎస్సీలు నిర్వహించి, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్లు కూడా జారీ చేసి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపడతామని తెలిపారు. 2014-19లో పులివెందులకు సాగునీరు ఇచ్చిన సీఎం చంద్రబాబు దేనన్నారు. ఇపుడు పులివెందులకు తాగు నీరు కూడా అందించబోతున్న ఘనత కూడా ఆయనేదనని మంత్రి సవిత తెలిపారు.

గతంలో ఎన్నడూ జరగలేనంత అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండళ్లలోనే చేపట్టామని మంత్రి సవిత తెలిపారు. గోరంట్ల మండలానికి సంబంధించి పలు ఎన్నికల హామీలు నెరవేర్చామని, మిగిలిన హామీలను స్థానిక ఎన్నికలు ముగియగానే చేపడతామని మాటిచ్చారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రాస్ కూటమి అయితే, విధ్వంసానికి మారు పేరు వైసీపీ అని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టాలని గోరంట్ల మండల వాసులకు మంత్రి సవిత పిలుపునిచ్చారు.

Related News