newsseals.com
News

రైల్వే ఉద్యోగుల‌కు సెటిల్‌మెంట్ పత్రాలు పంపిణీ

Posted by: VijayaBhaskar October 6, 2026
newsseals-DRM

గుంత‌క‌ల్ : పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు సెటిల్‌మెంట్ పత్రాలను పంపిణీ చేశారు గుంత‌క‌ల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ( డీఆర్ఎం) చంద్ర ఎస్. గుప్తా. డివిజనల్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పదవీ విరమణ చేస్తున్న 8 మంది ఉద్యోగులకు , సాధారణ పదవీ విరమణ (ONR) కాకుండా ఇతర కేసుల కింద ఉన్న నలుగురు సిబ్బంది ఉద్యోగులు/కుటుంబాలకు సెటిల్‌మెంట్ పత్రాలను అంద‌జేశారు.

ఈ సందర్భంగా చంద్ర ఎస్ గుప్తా మాట్లాడుతూ పదవీ విరమణ చేస్తున్న వారు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమతుల్య జీవన శైలిని పాటించాలని, వారి పదవీ విరమణ పొదుపును తెలివిగా నిర్వహించు కోవాలని సూచించారు. వారు కేవలం నమ్మకమైన ఆర్థిక పథకాలలో మాత్రమే పెట్టుబడి పెట్టాలని , మోసపూరిత కార్యకలాపాలు, ఆర్థిక కుంభకోణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హిత‌వు ప‌లికారు.

భారతీయ రైల్వేకు వారు అందించిన అంకితమైన సేవకు, విలువైన సహకారానికి డిఆర్‌ఎం హృదయపూర్వక ప్రశంసలు తెలిపారు . పదవీ విరమణ తర్వాత వారు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన ,సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని శుభాకాంక్షలు తెలియజేశారు డీఆర్ఎం.