newsseals.com

28న ఛ‌లో రామ్ లీలా మైదాన్ : శ్రీ‌నివాస్ గౌడ్

November 13, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : న్యూ ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఆల్ ఇండియా కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో 2027లో నిర్వహించనున్న కులగణనను సమగ్రంగా, శాస్త్రీయంగా, పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ నవంబర్ రామ్‌లీలా మైదాన్‌లో “చలో రామ్‌లీలా మైదాన్” దేశవ్యాప్త నిరసన కార్య‌క్ర‌మాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. 2027లో నిర్వహించనున్న కులగణనను సమగ్రంగా, శాస్త్రీయంగా, పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, జనరల్ కేటగిరీతో సహా దేశంలోని అన్ని కులాలకు ప్రత్యేక డ్రాప్‌డౌన్ ఆప్షన్లు కల్పించాలని కోరారు. ప్రతి కులానికి ప్రత్యేకమైన, ప్రామాణికమైన కోడ్ కేటాయించాలన్నారు. భారతదేశంలో ఓబీసీల జనాభా అధికంగా ఉన్నప్పటికీ, సరైన కులగణన లేకపోవడంతో జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లభించడం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఓబీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయం జరగాలంటే కచ్చితమైన, శాస్త్రీయమైన కులగణన గణాంకాలు అవసరం అని స్ప‌ష్టం చేశారు వి. శ్రీ‌నివాస్ గౌడ్. 2027 కులగణన దేశంలోని అన్ని కులాల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేందుకు లభించిన చారిత్రాత్మక అవకాశం అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కుల కోడ్లతో కూడిన సమగ్ర కులగణన చేపట్టి అన్ని కులాలకు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. “చలో రామ్‌లీలా మైదాన్” దేశవ్యాప్త నిరసనలో ఓబీసీ, బీసీ సంఘాలు, సామాజిక న్యాయ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు, సీనియర్ న్యాయవాది పి విల్సన్, రాజకీయ విశ్లేషకులు, భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, పార్టీ ఫర్ ది రైట్స్ ఆఫ్ ఓబీసీస్, SFRBC అధ్యక్షుడు వి. రత్నసబాపతి, అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం (AIOBCSA) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

Related News