newsseals.com
DEVOTIONAL

టీటీడీ విద్యా సంస్థల్లో మెరుగైన సదుపాయాలు

Posted by: VijayaBhaskar November 19, 2026
newsseals-TTD

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ ఏ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు, కమిషన్ సభ్యుల బృందం తిరుపతిలోని టీటీడీ విద్యా సంస్థలైన శ్రీ వేంకటేశ్వర బాల మందిరం, శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించింది. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర బాల మందిరంలోని వంటశాల, స్టోర్‌ను పరిశీలించి, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. వంటశాల, స్టోర్‌లో పాటిస్తున్న పరిశుభ్రత, క్రమబద్ధమైన నిర్వహణ, రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు. అనంతరం ఇతర విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్యా, సంరక్షణ, సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు.

బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, సమగ్ర సంక్షేమం కోసం టీటీడీ చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ఈ పర్యటనలో కమిషన్ సభ్యులు గాంధీ బాబు, జిల్లా బాలల సంరక్షణ అధికారి వి. శివశంకర్, సంరక్షణ అధికారి జె. దేవయాని, టిటిడి ఏఈవో బి. అమ్ములు, హెడ్మాస్టర్ పద్మావతమ్మ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఏపీ రాష్ట్ర బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ ఏవీఎస్ స‌త్య నారాయ‌ణ రాజు మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న విద్యా సంస్థ‌ల ప‌నితీరు అద్భుతంగా ఉంద‌ని ప్ర‌శంసించారు. మెరుగైన వ‌స‌తి స‌క‌ర్యాలు క‌ల్పించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి కూడా సూచ‌న‌లు అందించిన‌ట్లు చెప్పారు.