తిరుప్పరంకుండ్రం కొండపై వెలగనున్న దీపం

చెన్నై : తీవ్ర వివాదం నడుమ కార్తీక దీపోత్సవానికి మార్గం సుగమమైంది. నవంబర్ 24న తిరుప్పరంకుండ్రం కొండపై వెలగనుంది మురుగన్ దీపం. ఇదిలా ఉండగా తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న సంప్రదాయ దీపస్తంభం (Deepathoon) వద్ద దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాదికి ఒక్కసారి మాత్రమే ప్రత్యేక అనుమతి మంజూరు చేస్తూ కీలక ఆదేశాలు వెలువరించింది. దీపం వెలిగించే సంప్రదాయాన్ని అడ్డుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీఎం విజయ్‌కు తాజా పరిణామం ఎదురు దెబ్బగా మారింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించినప్పటికీ, కార్తీక దీపం రోజున దీపం వెలిగించేందుకు మాత్రం సుప్రీంకోర్టు అనుమతించింది.
అయితే ఈ ఒక్కరోజు అనుమతిని దీప స్తంభం వద్ద దీపం వెలిగించే సంప్రదాయ హక్కుకు శాశ్వత గుర్తింపుగా భావించరాదని భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్తానం స్పష్టం చేసింది. దేవస్థానం అధీకృత ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే దీపం వెలిగించేందుకు వెళ్లాలని, సాధారణ ప్రజలకు అనుమతి లేదని పేర్కొంది. పటిష్ట భద్రత కల్పించాలని, అవసరమైతే CISF బలగాలను మోహరించాలని కూడా ఆదేశించింది. దీనిపై స్పందించేందుకు తమిళనాడు సర్కార్ ఒప్పుకోలేదు. కోర్టు ఆదేశాలతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.