newsseals.com

డింపుల్ హయాతికి సంప‌త్ నంది సారీ

November 23, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : శర్వానంద్ హీరోగా నటించిన ‘భోగి’ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైద‌రాబాద్ వేదిక‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంపత్ నంది ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. డింపుల్ హయాతికి తాను ఇచ్చిన ఒక హామీని గుర్తు చేసుకున్నారు. ఒక పాటలో ఆమెను చాలా అందంగా, హుందాగా చూపిస్తానని మాట ఇచ్చానని అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని ఆయన చెప్పారు.

రాజ్ కపూర్ సినిమాల్లోని కథానాయికల తరహాలో డింపుల్‌ను చూపించాలని తాను అనుకున్నానని సంపత్ నంది తెలిపారు. ఎటువంటి గ్లామర్ ప్రదర్శన (స్కిన్ షో) లేదా అభ్యంతరకరమైన కెమెరా కోణాలు లేకుండా, ఆమె అందాన్ని, నటనను మాత్రమే హైలైట్ చేయాలని భావించానని పేర్కొన్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ పాటను తెరపైకి తీసుకు రాలేక పోయానని అన్నారు సంప‌త్ నంది. డింపుల్‌కు బహిరంగంగా క్షమాపణలు కోరడం ప్ర‌తి ఒక్క‌రినీ విస్తు పోయేలా చేసింది. భవిష్యత్తులో ఆమెతో కలిసి పనిచేసే అవకాశం వస్తే, ఖచ్చితంగా తన ఆలోచనను అమలు చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు.

సంపత్ నంది వ్యాఖ్యలపై డింపుల్ హయాతి కూడా స్పందించారు. చాలామంది తనను కేవలం గ్లామర్ కోణంలోనే చూశారని, కానీ సంపత్ నంది తన శరీర సౌందర్యంపై దృష్టి పెట్టకుండా, తన కళ్లలోని భావోద్వేగాలను గుర్తించార‌న్నారు. తనకు ఒక మంచి పాత్రను ఇచ్చారని ఆయనను ప్రశంసించారు. తనకు సంప‌త్ నంది ఇచ్చిన ప్రాముఖ్యతకు, గౌరవానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Related News