సీఎం జోసెఫ్ విజయ్ పై హైకోర్టు సీరియస్

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మద్రాస్ హైకోర్టు. ఎన్నికల సందర్భంగా కరూర్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంపై సీఎం విజయ్ను తీవ్రంగా విమర్శిస్తూ ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేశారు తీరన్ తిరుమురుగన్ అనే వ్యక్తి. దీంతో సర్కార్ ఆదేశాల మమేరకు తనపై FIR నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ బాధితుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కఠినమైన రాజకీయ విమర్శలు మాత్రమే నేరం కావు అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హింసను ప్రేరేపించడం లేదా ప్రజా శాంతికి తక్షణ ముప్పు కలిగించడం లేదని కోర్టు స్పష్టం చేసింది. విమర్శలు, ఆరోపణలు చేసినంత మాత్రాన క్రిమినల్ కేసులు ఎలా పెడతారంటూ ప్రశ్నించింది..ఒక రకంగా టీవీకే సర్కార్ ను నిలదీనంత పని చేసింది . ఇందుకు సంబంధించి న్యాయమూర్తి జస్టిస్ ఆర్. విజయకుమార్ నవంబర్ 20న ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలకు క్రిమినల్ కేసులే సమాధానం కావు అని కుండ బద్దలు కొట్టారు.