పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న త్రిష కృష్ణన్
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో సీఎంగా టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కొలువు తీరాక ప్రముఖ నటి త్రిష కృష్ణన్ ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు. తను టీవీకేలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆపై ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, తను ఏకంగా మంత్రిని చేస్తారంటూ విజయ్ గురించి వార్తలు వెలువడ్డాయి. తమిళనాడులో నటి త్రిష కృష్ణన్ మరో జయలలిత కానుందని పేర్కొంటున్నారు. ఇక తమిళులకు సినీరంగానికి చెందిన వారంటే వల్లమాలిన అభిమానం. ఆనాడు జయలలితకు, ఖుష్బూ సుందర్ కు గుడి కట్టారు.
ఇప్పుడు అందరి దృష్టి త్రిష కృష్ణన్ పై ఉంది. దీనికి కారణం తాను పాలిటిక్స్ లోకి రానుందని తెలిపేందుకు ఓ పోస్టర్ కారణమైంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చకు దారితీసేలా చేసింది. విజయ్ దళపతి మాజీ ప్రేయసి త్రిష కృష్ణన్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారంటూ ఆయన అభిమానులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. నటి త్రిష కృష్ణన్ సీఎంతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం మీరు ఇప్పటికే చూసి ఉండవచ్చు. అయితే ఇప్పుడు త్రిష స్వయంగా తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు .ఈ విషయం వెలుగులోకి వచ్చింది, నటి త్రిష కృష్ణన్ మద్దతుదారులు “యువ విప్లవాత్మక నాయకురాలు త్రిష” (Young Revolutionary Leader Trisha) అనే పేరుతో ఒక ఫోరమ్ను ప్రారంభించినప్పుడు ఈ వార్త బయటకు వచ్చింది. నటి త్రిష కృష్ణన్ ఆకుపచ్చ రంగు చీర ధరించి, చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు కనిపిస్తున్నారు.