newsseals.com
News

ముగిసిన మూడు రోజుల ఇంచార్జ్ పర్యటన

Posted by: VijayaBhaskar November 25, 2026
newsseals-AICCIncharge

హైదరాబాద్ : నూతనంగా నియామకమైన ఏఐసీసీ ఇంచార్జ్ బిఎం సందీప్ కుమార్ మూడు రోజుల తెలంగాణ పర్యటన విజయవంతంగా ముగిసింది. 22వ తేదీన హైదరాబాద్ కు వచ్చిన ఇంచార్జ్ సందీప్ కు విమానాశ్రయంలో, గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పీఏసీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. 22న గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ , సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంచార్జ్ సందీప్ తో పాటు సీఎం, పీసీసీ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు. అదే రోజు సాయంత్రం పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 23న ఉదయం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాలు జరిగాయి. తర్వాత డీసీసీ అధ్యక్షులతో, అనుబంధ సంఘాల ఛైర్మన్ లతో ప్రత్యేకంగా సమావేశాలు జరిగాయి.

23న రాత్రి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి లతో ఇంచార్జ్ భేటి అయ్యారు . 24న ఉదయం పలువురు కాంగ్రెస్ నాయకులను కలిసి పార్టీ అంతర్గత అంశాలపై చర్చించారు. 24న సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు. ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ కుమార్ 26న తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. ఆ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో జరగనున్న సంసద్ రక్షా మార్చ్ లో పాల్గొంటారు. 27న హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఎంపీలు, ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులతో మాట్లాడతారు. పార్టీ బ‌లోపేతం కోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి చ‌ర్చిస్తారు.