newsseals.com
DEVOTIONAL

సీఎం జోసెఫ్ విజ‌య్ పై సుప్రీంకోర్టు సీరియ‌స్

Posted by: VijayaBhaskar November 28, 2026
newsseals-CM

చెన్నై : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌మిళ‌నాడు స‌ర్కార్ పై, సీఎం విజ‌య్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. తిరుప్పరం కుండ్రం కొండపై కార్తీక దీపాన్ని వెలిగించాలంటూ ఆదేశించింది న‌వంబ‌ర్ 20న.అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాక పోవడం ప‌ట్ల మండి ప‌డింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వ తీరుపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరిస్థితిని ఇనుప హస్తంతో ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. లేదంటే రాజ్యాంగ పరమైన గందరగోళం ఏర్పడుతుంది అని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం, న్యాయపాలన అత్యున్నతమైనవని గుర్తు చేసింది. ఆర్టికల్ 144 ప్రకారం దేశంలోని అన్ని అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది.

మధురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించేందుకు సాక్షాత్తూ సుప్రీంకోర్టు అనుమతించినా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరం అని పేర్కొంది. రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించడం నుంచి తిరుపరంకుండ్రంలోని కార్తీక దీపం వెలిగించడాన్ని అడ్డుకోవడం వరకు.. ఇండియా కూటమి వైఖరి హిందూ విశ్వాసాల పట్ల వారి వివక్షాపూరిత ధోరణిని స్పష్టం చేస్తోందని ఈ సంద‌ర్భంగా ఆరోపించింది బీజేపీ. హిందువుల విశ్వాసాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు సాధనం కావు. భక్తుల ఆధ్యాత్మిక హక్కులను కాపాడుకోవడంలో హిందూ సమాజం దృఢంగా నిలబడుతుందని పేర్కొంది.