సీఎంను కలిసిన యూఏఈ మంత్రి అబ్దుల్ బిన్ తౌక్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వకంగా మంగళవారం కలిశారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి . ఈ ఏడాదిలో ముఖ్యమంత్రి దావోస్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌లో ‘ఫుడ్ క్లస్టర్’ను ఏర్పాటు చేయడానికి UAE తన సంసిద్ధతను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. UAE ప్రతినిధి బృందంతో జరిపిన సమగ్ర చర్చల అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , UAE మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.
మామిడి, అరటి , కోకో వంటి వివిధ ఉద్యానవన పంటలను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు వీలుగా ఒక ‘వాల్యూ చైన్’ (విలువ గొలుసు వ్యవస్థ)ను ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ టి.జి. భరత్ తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ చర్చలలో ఆంధ్రప్రదేశ్‌లో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో యుఏఈ ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఆహార శుద్ధి రంగంలో ఏపీలో వ్యాల్యూచైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది యూఏఈ. ఈమేరకు ఏపీ ప్రభుత్వం- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య భాగస్వామ్యం ఏర్పాటు కుదిరింది.