newsseals.com
SPORTS

గౌతం గంభీర్ పై కృష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ ఫైర్

VijayaBhaskar July 22, 2026
newsseals-KrishnamaachariSrikkanath

చెన్నై : భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ కృష్ణ‌మాచారి శ్రీ‌కాంత్. త‌న నిర్వాకం కార‌ణంగానే ఇండియా దారుణ‌మైన ఓట‌మిని చ‌వి చూస్తోంద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయ‌న చెన్నైలో ఓ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశారు. త‌న‌తో పాటు ప్ర‌స్తుతం కెప్టెన్ గా ఉన్న శుబ్ మ‌న్ గిల్ ను కూడా ఏకి పారేశాడు. ఈ ఇద్ద‌రు త‌మ‌కు ఇష్ట‌మైన ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసుకుంటూ పోతే ఇక భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎందుకు ఉంద‌ని ప్ర‌శ్నించారు కృష్ణ‌మాచారి శ్రీ‌కాంత్. ఇదే స‌మ‌యంలో భారత జట్టులో కేఎల్ రాహుల్ పాత్రపై గౌతమ్ గంభీర్‌ను తీవ్రంగా విమర్శించారు.

మొదట మీరు సంజు సామ్సన్‌ను నాశనం చేశారు, ఆ తర్వాత వైభవ్ సూర్యవంశిని. ఇప్పుడు కేఎల్ రాహుల్ విషయంలో అదే చేస్తున్నారంటూ తీవ్ర స్తాయిలో మండిప‌డ్డారు శ్రీ‌కాంత్. భారత్ 388 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు, భారతదేశపు అత్యంత నమ్మకమైన బ్యాటర్లలో ఒకడైన కేఎల్ రాహుల్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి ఎందుకు పంపారని శ్రీకాంత్ ప్రశ్నించారు. రాహుల్‌కు ఒక స్థిరమైన స్థానం ఇవ్వకుండా, ప్రతి సిరీస్‌లోనూ విభిన్న పాత్రలు పోషించేలా బలవంతం చేస్తున్నారంటూ ఇలా అయితే ఆట‌గాళ్లు ఎలా ఆట మీద ఫోక‌స్ పెడ‌తార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.