రాజకీయాల్లో రాజీనామాలు సహజం : సీఎం

బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త కేబినెట్ కూర్పుపై కొందరు ఆశావాహులు తమకు చోటు దక్కక పోవడం పట్ల బహిరంగంగానే విమర్శలు చేయడం పట్ల స్పందించారు తీవ్రంగా సీఎం. ఈ సందర్బంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల రాజీనామాల వార్తలన్నీ సహజమే కావచ్చని పేర్కొన్నారు. ఈ సందర్బంగా రాజకీయాల్లో రాజీనామాలు సహజం అని పేర్కొన్నారు. రాజీనామా చేయాలనుకునే వారిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. పార్టీ , రాజకీయ భవిష్యత్తు కావాలనుకుంటే వారు పార్టీలోనే కొనసాగాలే తప్పా ఇలా రాజీనామాలు చేసుకుంటూ పోతే ఏ ఒక్కరు మిగలరన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మిగిలినవన్నీ సాధ్యమవుతాయని మరోసారి స్పష్టం చేశారు సీఎం డీకే శివకుమార్. ధరం సింగ్ , సిద్ధరామయ్య హయాంలో నాకు మంత్రి పదవి దక్కనప్పుడు నేను కూడా రాజీనామా చేసి ఉండవచ్చు కదా? కానీ నేను, జి. పరమేశ్వర సంయమనం పాటించాం కదా? అని గుర్తు చేశారు . అలాగే, మంత్రులందరూ వెంటనే తమ నియోజకవర్గాలకు వెళ్లి కరువు సహాయక చర్యల పరిస్థితిని సమీక్షించాలని తాను ఆదేశించడం జరిగిందన్నారు. ఇక నుంచి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలన్నారు.