newsseals.com
News

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు రిలీఫ్

Posted by: VijayaBhaskar August 5, 2026
newsseals-RevanthReddy

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది ఓటుకు నోటు కేసు . ఇందులో నిందితుడిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఈ కేసు విచార‌ణ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇదిలా ఉండ‌గా తాను విదేశాల‌లో ప‌ర్య‌టించాల్సి ఉంద‌ని, త‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి ఇవ్వాల‌ని ఆయ‌న త‌ర‌పున పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది కేసును విచారిస్తున్న అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ).

ఓట్-నోట్ కేసులో మొదటి నిందితుడైన రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి కోరారు. విచార‌ణ చేప‌ట్టిన కోర్టు షరతులతో కూడిన విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. ఈ నెల ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యూకే, యూఎస్, జర్మనీ, చైనా పర్యటనకు వీలుగా ఓట్-నోట్ కేసులో స్వాధీనం చేసుకున్న తన పాస్‌పోర్ట్‌ను విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టును అభ్యర్థించారు

ఓట్-నోట్ కేసులో బెయిల్ షరతులను సడలించాలన్న అభ్యర్థనకు ప్రతిస్పందనగా, రూ.1 లక్ష పూచీకత్తు, విదేశాల్లోని చిరునామా, సంప్రదింపు వివరాలు అందించడంతో సహా పలు షరతులతో ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది.సెప్టెంబర్ 18 లోగా పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇస్తామని పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది