newsseals.com
News

పోస్ట‌ల్ ఇన్‌స్పెక్టర్ కౌశిక్ కు కేంద్ర మంత్రి కంగ్రాట్స్

Posted by: VijayaBhaskar August 11, 2026
newsseals-Pemasani

న్యూఢిల్లీ : కేంద్ర టెలికాం, పోస్ట‌ల్ శాఖ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తమిళనాడు సర్కిల్‌లోని బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్ ఎస్. కౌశిక్ ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌ను చేసిన ప‌నికి ఇవాళ దేశంలోని కోట్లాది మంది పోస్ట‌ల్ ఖాతాదారుల‌కు ఎంతో మేలు జ‌రుగుతోంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా త‌న‌ను ప్ర‌త్యేకంగా ఎక్స్ వేదిక‌గా అభినందించారు. త‌ను ప్ర‌స్తుతంతమిళనాడు పోస్టల్ సర్కిల్‌లో ఆధార్ సేవలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు http://doptnaadhar.online పోర్టల్‌ను రూపొందించారు.

Pythonతో అభివృద్ధి చేసి, Google Cloud Storage ఆధారంగా రూపొందించిన ఈ పోర్టల్ UIDAI నుంచి ప్రతిరోజూ ఆధార్ డేటాను ఆటోమేటిక్‌గా సేకరించేందుకు వీలు క‌లుగుతోంద‌న్నారు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. తమిళనాడు వ్యాప్తంగా 1,457కు పైగా పోస్టాఫీస్ కిట్లలో జరుగుతున్న ఆధార్ నమోదు, అప్‌డేట్ పనితీరును ట్రాక్ చేస్తోంది. గతంలో సమయం తీసుకునే మాన్యువల్ ప్రక్రియను ఇప్పుడు వేగవంతమైన, సులభమైన, విశ్వసనీయమైన డిజిటల్ వ్యవస్థగా మార్చడం ఈ పోర్టల్ ప్రత్యేకత.

అంతే కాకుండా రియల్‌టైమ్ పనితీరు ర్యాంకింగ్స్, యాక్టివ్ కిట్లను సులభంగా ట్రాక్ చేసే సదుపాయం, మరింత శ్రద్ధ అవసరమైన ప్రాంతాలను త్వరగా గుర్తించే అవకాశం ద్వారా పోస్టల్ శాఖ పనితీరును మరింత మెరుగు పరచడంలో ఇది ఉపయోగ పడుతోంది . ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో పోస్టల్ శాఖలోనే సాంకేతిక పరిష్కారాలను రూపొందిస్తున్న అధికారులు, ఉద్యోగుల అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం. తమిళనాడు పోస్టల్ సర్కిల్‌కు ఇది గర్వకారణమైన ఆవిష్కరణ అని ప్ర‌శంసించారు.