newsseals.com
News

తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

Posted by: VijayaBhaskar August 17, 2026
newsseals-Avinashohanthy

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన మొహంతి, తన సాధారణ విధులతో పాటు ఈ కొత్త బాధ్యతను కూడా నిర్వర్తిస్తారు. 2005 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతి, ‘తెలంగాణ SAFE’ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) కమిషనర్‌గా నియమితులయ్యారు. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.

అవినాష్ మొహంతి తన సాధారణ విధులతో పాటు ఈ కొత్త బాధ్యతను కూడా నిర్వర్తిస్తార‌ని తాజాగా స‌ర్కార్ జారీ చేసిన ఉత్త‌ర్వుల‌లో పేర్కొన్నారు సీఎస్. ఆహార భద్రత శాఖ (Food Safety Department) , డ్రగ్స్ కంట్రోల్ శాఖలను ఏకీకృత యంత్రాంగం అయిన ‘TG SAFE’ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) పరిధిలోకి తీసుకు రావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర‌కు అవినాష్ కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఇదిలా ఉండ‌గా రేవంత్ రెడ్డి స‌ర్కార్ కొలువు తీరిన ఈ మూడేళ్ల కాలంలోనే ప‌లువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లను బ‌దిలీలు చేస్తూ వ‌స్తోంది. దీంతో పాల‌నా ప‌రంగా ప‌నులు ఆల‌స్యం అవుతున్నాయి.