newsseals.com
DEVOTIONAL

రెండు ఆలయాలు దేవాదాయ శాఖకు అప్పగింత

Posted by: VijayaBhaskar August 20, 2026
newsseals-APEndowmeent

తిరుప‌తి అన్న‌మ‌య్య‌ జిల్లా : అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం వెంగలపల్లె గ్రామం రాజనాలబండలోని శ్రీ ప్రసన్నఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర తో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖకు అధికారికంగా అప్పగించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఉదయం 10.30 గంటలకు తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ సముదాయాల ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి మదనపల్లిలోని దేవాదాయ శాఖ అధికారి విశ్వనాథంకు రెండు ఆలయాల బాధ్యతలను అధికారికంగా అప్పగించారు.

టీటీడీ పరిధిలో ఉన్న ఈ రెండు ఆలయాలతో పాటు వాటికి సంబంధించిన ఆస్తులు, ఆభరణాలను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంబంధిత దేవాదాయ శాఖకు అప్పగించే ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేసినట్లు ఈ సంద‌ర్బంగా వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఏవో వెంకటరమణ, టాస్క్‌ఫోర్స్ తహశీల్దార్ లలితాంజలి, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ పద్మప్రియ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.