ఉండవల్లికి సుప్రీం బిగ్ షాక్ పిటిషన్ డిస్మిస్

న్యూఢిల్లీ : భారత సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు. గురువారం మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాలు చేశారు మాజీ ఎంపీ. ఉండవల్లి దాఖలు చేసిన ఎస్ఎల్పీపై ఇవాళ సుప్రీంకోర్టు తుది విచారణ చేపట్టింది. ఉండవల్లి పిటిషన్పై విచారణ జరిపింది జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం . పిటిషన్ దాఖలు చేయడానికి మీరెవరని విచారణ సందర్బంగా ఉండవల్లిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు .
ఈ కేసును మొదటి నుంచి పరిశీలిస్తే.. మీ వ్యక్తిగత వివాదంగా ఉందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు
-ఈ కేసులో మీరు వాదించే కొద్దీ మీపైనే అనుమానాలు పెరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు జస్టిస్ ఎంఎం సుందరేశ్ . మార్గదర్శి తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనీయర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, నాగముత్తు .ఇప్పటి వరకు రూ.2,500 కోట్లు వెనక్కి ఇచ్చేసినట్లు చెప్పారు. క్లెయిమ్ చేయని రూ.5.23 కోట్లు ఎస్క్రో అకౌంట్లో జమ చేశారని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు తెలంగాణ హైకోర్టు వ్యవహరించిందని తెలిపారు న్యాయవాదులు. వాదనల అనంతరం ఉండవల్లి పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది ధర్మాసనం.