newsseals.com
News

ఇక నుండి ప్ర‌తీ రోజూ దానాపూర్ బెంగ‌ళూరు ఎక్స్ ప్రెస్

Posted by: VijayaBhaskar August 29, 2026
newsseals-DanappurBangaloreExpress

హైద‌రాబాద్ : ప్ర‌యాణీకుల‌కు తీపి క‌బురు చెప్పింది ద‌క్షిణ మ‌ధ్య రైల్వే . సెప్టెంబర్ 1 నుండి ప్రతిరోజూదానాపూర్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ న‌డుస్తుంద‌ని తెలిపింది. 1న మధ్యాహ్నం 2:45 గంటలకు దానాపూర్ నుండి బయలు దేరుతుంది. ఈ రోజువారీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పెరంబూర్, కాట్పాడి , జోలార్‌పేట మీదుగా నడుస్తుంది. దానాపూర్–SMVT బెంగళూరు–దానాపూర్ ప్రత్యేక రైలు సేవలు ఇప్పుడు సాధారణ సేవలుగా మార్చబడ్డాయి . ఇకపై రోజువారీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా నడుస్తాయి. రైలు నంబర్లు 22365/22366 దానాపూర్ , సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) బెంగళూరు మధ్య రాకపోకలు సాగిస్తాయి. ఈ రోజువారీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పెరంబూర్, కాట్పాడి , జోలార్‌పేట మీదుగా ప్రయాణిస్తాయి.

దానాపూర్–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 22365) సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 2:45 గంటలకు దానాపూర్ నుండి బయలు దేరుతుంది. ఇది సెప్టెంబర్ 2న సాయంత్రం 7 గంటలకు వరంగల్ చేరుకుని, రెండు నిమిషాల తర్వాత సాయంత్రం 7:02 గంటలకు అక్కడి నుండి బయలు దేరుతుంది. విజయవాడ మీదుగా ప్రయాణించే ఈ రైలు సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 2:30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. అదేవిధంగా బెంగళూరు–దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 22366) సెప్టెంబర్ 3న రాత్రి 11:30 గంటలకు బెంగళూరు నుండి బయలు దేరుతుంది. సెప్టెంబర్ 4న సాయంత్రం 6:18 గంటలకు వరంగల్ చేరుకుని, రెండు నిమిషాల విరామం తర్వాత సాయంత్రం 6:20 గంటలకు బయలు దేరుతుంది. విజయవాడ మీదుగా ప్రయాణించే ఈ రైలు సెప్టెంబర్ 5న అర్ధరాత్రి 12:15 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.