newsseals.com
News

వైసీపీలో స‌జ్జ‌లదే ఆధిప‌త్యం : విజ‌య‌సాయి రెడ్డి

Posted by: VijayaBhaskar August 29, 2026
newsseals-VijaySaireddy

విజ‌య‌వాడ : మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న బ‌హిరంగ లేఖ రాశారు వైసీపీ అధినేత‌కు. వైసీపీలో అవమానాలు భరించలేక బయటికి వచ్చాన‌ని పేర్కొన్నారు నాపై నమ్మకద్రోహి అంటూ వైసీపీ కోటరీ దుష్ప్రచారం చేసిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జగన్ 16 నెలలు జైల్లో ఉంటే నన్ను 15 నెలలు జైల్లో పెట్టారన్నారు. నాకు సంబంధం లేని లిక్కర్ స్కాంలోనూ నన్ను A5గా చేర్చారని వాపోయారు విజ‌య సాయి రెడ్డి. కాకినాడ సీ పోర్టు కేసులో కూడా A2గా చేర్చార‌ని పేర్కొన్నారు .

నమ్మకద్రోహిని అయితే ఆనాడే సజ్జల రామ‌కృష్ణా రెడ్డి మాదిరిగా కాంగ్రెస్‌తో సంధి చేసుకునేవాడినిన‌ని బాంబు పేల్చారు మాజీ ఎంపీ . ఇప్పుడు వైసీపీలో నంబర్-2 జగన్.. నంబర్-1 సజ్జల.. సజ్జలకు తలవంచి పని చేయడం నావల్ల కాదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. జగన్‌కు నేను నమ్మకద్రోహం చేయలేదని , ఏనాడూ చేయ‌బోనంటూ ప్ర‌క‌టించారు. త‌న‌కు న‌మ్మించి మోసం చేయ‌డం త‌న వ‌ల్ల కాద‌న్నారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయాల‌ని అనుకుంటే తాను ఏనాడో పార్టీ మారి ఉండేవాడినంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. త‌న‌ను కావాల‌ని ల‌క్ష్యంగా చేసుకుని , వ్య‌క్తిగ‌తంగా డ్యామేజ్ చేసే ప‌ని చేయొద్ద‌ని సూచించారు. ఇదిలా ఉండ‌గా విజ‌య సాయిరెడ్డి చేసిన తాజా కామెంట్స్ వైసీపీలో చ‌ర్చ‌కు దారితీశాయి.