newsseals.com
News

పిల్ల‌ల‌కు వ్య‌వ‌సాయం అల‌వాటు చేయాలి

VijayaBhaskar November 25, 2025
newsseals-AnithaVangalapudi
Spread the love

పిలుపునిచ్చిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి : రైతుల సంక్షేమం కోసం త‌మ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ప్ర‌తి ఒక్క‌రూ సేంద్రీయ వ్య‌వ‌సాయం చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. పిల్ల‌ల‌కు కూడా వ్య‌వ‌సాయం అల‌వాటు చేయాల‌ని సూచించారు. ప్ర‌ధానంగా సేంద్రీయ వ్యవసాయంపై విద్యార్థి దశ నుండే అవగాహన క‌ల్పించాల‌ని, ఇది అత్యంత అవ‌స‌ర‌మ‌ని అన్నారు. ఎన్డియే ప్రభుత్వం రైతులకు
ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. దేశానికి వెన్నెముక రైతు అని పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న రామభద్రాపురం రైతులు ఎంతోమందికి ఆదర్శం అని ప్ర‌శంసించారు. ‘రైతన్నా మీకోసం’ రైతు వారోత్సవాల భాగంగా అన్నదాతల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

పాయకరావుపేట మండలం రామభద్రాపురంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. అనంతరం పెద రామభద్రాపురంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు, వివిధ అంశాలపై చర్చించారు. ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకంలో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గ రైతులకు రూ. 25.60 కోట్ల చెక్కులను అంద చేశారు. ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా డ్రోన్‌తో సేంద్రియ ఎరువుల పిచికారీ స్వ‌యంగా చేశారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన వ్య‌వ‌సాయ స్టాల్స్ ను ప‌రిశీలించారు. సేంద్రియ వ్యవసాయంపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించి, భవిష్యత్ తరాలకు నాణ్యమైన జీవితాన్ని అందించేందుకు రైతులు చేస్తున్న కృషికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు.