newsseals.com
DEVOTIONAL

శ్రీ‌కాళ‌హ‌స్తి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

VijayaBhaskar February 12, 2026
newsseals-Srikalahasthi
Spread the love

మ‌హా శివ‌రాత్రి పండుగ‌కు పండుగ ముస్తాబు

తిరుప‌తి జిల్లా : పంచభూత లింగాల్లో వాయు లింగ క్షేత్రమున శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని స్వామి వారికి ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా వేద పండితులు నిర్వహించారు. ధ్వజారోహణ తో మొదలయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్ల పురవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. వేలాదిగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకున్నారు.

ధ్వజారోహణ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని కోడి స్తంభానికి భక్తులు ముడుపు చీరలను మొక్కుకుంటారు. కోడి స్తంభానికి ధ్వజారోహణ సమయంలో భక్తులు ఇచ్చిన చీరలను కొడిస్తంభానికి అలంకరించడం ఇక్క‌డ ఆన‌వాయితీగా వ‌స్తోంది. ధ్వజారోహణ కార్యక్రమంలో భక్తులు హర హర మహాదేవ శంభో శంకర సాంబ సదాశివ అంటూ శివనామస్మరణలు ఆలయంలో మారు మృగాయి. అత్యంత వైభవంగా స్వామి వారి ధ్వజారోహణ కార్యక్రమం ఆలయ అధికారులు నిర్వహించారు.