newsseals.com
DEVOTIONAL

క‌ల్కి అవ‌తారంలో శ్రీ క‌ల్యాణ శ్రీ‌నివాసుడు

VijayaBhaskar February 15, 2026
newsseals-AshwaVahanam
Spread the love

అశ్వ వాహనంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం

తిరుపతి : శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా 8వ రోజు ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ల్కి అలంకారంలో అశ్వ వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. స్వామి అశ్వ వాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలి దోషాలకు దూరంగా ఉండాలని, తన సంకీర్తనలు చేసి తరించాలని ప్రబోధిస్తున్నారు.

సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌చ్చారు భ‌క్త బాంధ‌వులు. ఈ సంద‌ర్బంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండ‌గా ముందు జాగ్ర‌త్త‌గా తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బా రాయుడు ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ జ‌రిగిన బ్రహ్మోత్స‌వాలలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్‌, కంకణ బట్టర్ శ్రీ బాలాజీ రంగాచార్యులు, సూప‌రింటెండెంట్ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్‌, ధ‌నశేఖ‌ర్‌, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.