newsseals.com
News

జగన్ మూడు ముక్కలాటతో సర్వనాశనం

Posted by: VijayaBhaskar March 29, 2026
newsseals-SSavitha

నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. 30 వేల ఎకరాల్లో అమరావతి రాజధాని ఉండాలని ఇదే అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చొన్న జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని మంత్ర సవిత గుర్తు చేశారు. ‘అమరావతిని నేను స్వాగతిస్తున్నాను… నేను ఒప్పుకుంటున్నాను… ఇల్లు కూడా కట్టుకున్నాను’ అని ప్రజలను నమ్మించారన్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల సమయంలో ఎక్కడ సభ జరిగినా ఇదే మాట చెపుకుంటూ వచ్చారన్నారు.

తీరా అధికారంలోకి వచ్చిన అమరావతిపై మాటతప్పి, మూడు ముక్కలాట ఆట ఆడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. జగన్ తీరును ఎండగడుతూ ఆనాడు టీడీపీ, బీజేపీ, జనసేన, ప్రజా సంఘాలతో రాజధాని ప్రాంత రైతుల పెద్ద ఎత్తున నిరసన తెలిపారన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాకతో మరోసారి సుందర అమరావతి నిర్మాణ పనులు ఊపందకున్నాయన్నారు ఎస్. స‌విత‌. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం చేయడం ద్వారా భవిష్యత్తుల్లో మరెవరూ రాజధాని కదపడానికి అవకాశం ఉండదన్నారు. తీర్మానం ప్రవేశ పెట్టినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు.