newsseals.com
DEVOTIONAL

ఘాట్ రోడ్డులో మ‌ర‌మ్మ‌త్తులు జ‌ర భ‌ద్రం

VijayaBhaskar April 1, 2026
newsseals-TTDRoaad
Spread the love

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుమల : భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారి) బీ.టీ రోడ్డు మారమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసి వేయకుండా నిర్దేశించిన సమయంలో మరమ్మతు పనులను పూర్తి చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. కనుక, భక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని తదనుగుణంగా మార్చుకుని కనీసం గంట ముందుగా ప్రారంభించాలని టిటిడి కోరింది.

మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాల‌ని సూచించింది. ఈ నేపథ్యంలో తిరుమల నుండి రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్డీసీ బస్ స్టాండ్లు వెళ్ళే భక్తులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని టిటిడి స్ప‌ష్టం చేసింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు, భక్తులు తమ తిరుమల ప్రయాణన్ని రూపొందించు కోవాలని కోరింది. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి కావడానికి భక్తులు, వాహదారులు సహకరించాలని విన్న‌వించింది.