newsseals.com
SPORTS

చెన్నై సూప‌ర్ కింగ్స్ భ‌ళా కోల్ క‌తా విల విల

VijayaBhaskar April 15, 2026
newsseals-CSKWin
Spread the love

స‌త్తా చాటిన సంజు శాంస‌న్ , ఆయుష్ మాత్రే

చెన్నై : తమిళ తంబిలు ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఐపీఎల్ 2026 మెగా టోర్న‌మెంట్ లో భాగంగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో స‌త్తా చాటింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని సీఎస్కే. వ‌రుస‌గా ప్రారంభంలో మూడు మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ప్ర‌ధానంగా రూ. 18 కోట్ల‌కు భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన సంజూ శాంస‌న్ ఆశించిన ఆడ‌లేక పోయాడు. కేవ‌లం 9, 6, 7 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. కానీ ఆ త‌ర్వాత అక్ష‌ర్ ప‌టేల్ నేతృత్వంలోని ఢిల్లీ కేపిట‌ల్స్ పై అద్భుతమైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు సంజు శాంస‌న్. త‌ను 58 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 4 సిక్స్ ల‌తో 115 ప‌రుగులు చేశాడు. చివ‌రి వ‌ర‌కు అజేయంగా ఉన్నాడు. దీంతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

తాజాగా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్ లోనూ శాంస‌న్ రాణించాడు. 48 ప‌రుగులు చేశాడు. త‌న‌తో పాటు ఆయుష్ మాత్రే 17 బంతులు ఎదుర్కొని 38 ప‌రుగులు చేశాడు. డేవిస్ 41 ర‌న్స్ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 192 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 160 ప‌రుగులు చేశాడు. చెన్నై బౌల‌ర్లు సూప‌ర్ షో చేశారు. నూర్ అహ్మ‌ద్ 21 ర‌న్స్ ఇచ్చి 3 కీల‌క వికెట్లు తీస్తే కంబోజ్ 26 ప‌రుగులు ఇచ‌చ్చి 2 వికెట్లు తీశాడు. ఈ విజ‌యంతో చెన్నైకి ఇది రెండో విజయం.