newsseals.com
News

పోలవరం నల్లమల సాగర్ లింక్ : సీఎం

Posted by: VijayaBhaskar April 15, 2026
newsseals-PolavaramNallamala

సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్ కు పంపుతుంది

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 200 టీఎంసీల గోదావరి వరద నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల సాగర్‌కు తరలించేందుకు రూ.58,700 కోట్లు ఖర్చు కానుందని అన్నారు. దీనికి సంబంధించి సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్ కు అక్టోబర్ 31 కల్లా ఆమోదం లభిస్తుందని అన్నారు. అటవీ, పర్యావరణ అనుమతులు ఆర్ అండ్ ఆర్ క్లియరెన్స్ సెప్టెంబర్ 30కి పూర్తి కానున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. చింతలపూడి లిఫ్ట్‌కు పర్యావరణ అనుమతులు వచ్చాయని, ఈ ప్రాజెక్టుకు రూ.8,075 కోట్ల వ్యయం కానుందని అంచనాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు.

ప్రాజెక్టు ప్రధాన కాలువ పనులు చేప్టటి, 2027 జూన్‌కు పూర్తి చేయాల్సి ఉండగా, దీనికి రూ.2,042 కోట్లు అవసరం కానున్నాయి. ప్రధాన కాలువకు అవసరమైన 910 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం రూ.152 కోట్లను కేటాయించింది. అటు వరికెపుడిశెల ఎత్తిపోతల పథకానికి రూ.3,278 కోట్లు ఖర్చు కానుందని, దీని ద్వారా 84,500 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ముఖ్యమంత్రికి తెలిపారు. తీగ లేరు కెనాల్ హెడ్ రెగ్యులేటర్ గేట్లు, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, డైవర్సన్ రోడ్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మొత్తం వెలిగొండ పనులు జూన్ చివరి కల్లా పూర్తి చేయాలని లక్ష్యం కాగా, దీనికి రూ.2,042 కోట్లు వ్యయం కానుంది.