newsseals.com
News

శ్రీమన్నారాయణ మహా యజ్ఞానికి జగన్‌కు ఆహ్వానం

Posted by: VijayaBhaskar April 15, 2026
newsseals-YSJagan

ఏప్రిల్ 19 నుంచి 29వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న య‌జ్ఞం

అమ‌రావ‌తి : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని ఆయన నివాసంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామి . ఈ సంద‌ర్భంగా శ్రీమన్నారాయణ మహాయజ్ఙ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు స్వామి వారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం శ్రీ శ్రీమన్నారాయణ స్వామివారి దేవస్ధానం రాజగోపుర కుంభప్రోక్షణ సందర్భంగా ఈ నెల 19 నుంచి 29 వరకు శ్రీమన్నారాయణ మహాయజ్ఞం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ సందర్భంగా అభినవ మేల్కోట భక్తి గీత మాలిక సీడీని ఆవిష్క‌రించారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. అనంతరం సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామిని సత్కరించారు. వైయస్‌ జగన్‌కు ఆలయ విశిష్టతను వివరించి, మహాయజ్క్షానికి ఆహ్వనించారు జీయర్‌ స్వామి. దేశంలో ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తీసుకువస్తాయని అన్నారు. ఇటువంటి మహాయజ్ఞాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు జ‌గ‌న్ రెడ్డి.