newsseals.com
ENTERTAINMENT

సిఎం జోసెఫ్ విజ‌య్ తో క‌మ‌ల్ హాస‌న్ భేటీ

VijayaBhaskar May 17, 2026
newsseals-KamalHasan
Spread the love

త‌న‌ను క‌లుసుకోవ‌డం ఆనందంగా ఉంది

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరారు అగ్ర న‌టుడు ద‌ళ‌ప‌తి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌ను చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌తో పాటు రాజ‌కీయ‌, క్రీడా, వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు పోటీ ప‌డుతున్నారు త‌న‌ను క‌లిసేందుకు. ఈ సంద‌ర్బంగా తాజాగా రాజ్య‌స‌భ స‌భ్యుడు, ఇల‌య నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం విజ‌య్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర‌, దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రి అగ్ర న‌టుల క‌ల‌యిక ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

జోసెఫ్‌ తమిళనాడు అభివృద్ధి కోసం తన అనేక కలలను ఉత్సాహంగా పంచుకున్నారు. సమావేశంలో ఆయన ప్రదర్శించిన వినయం, ఆప్యాయత నన్ను గర్వంతో నింపాయన్నారు క‌మ‌ల్ హాసన్. వివిధ అడ్డంకులను ఎదుర్కొంటున్న తమిళ చిత్ర పరిశ్రమకు తమిళనాడు ప్రభుత్వ మద్దతు, ఆదరణ ఎంతో అవసరమని నొక్కి చెప్పాన‌ని అన్నారు. తాను సోద‌ర స‌మానుడైన తిరు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ కు ఆరు ముఖ్య‌మైన డిమాండ్ల‌తో కూడిన విన‌తి ప‌త్రాన్ని స‌మర్పించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు క‌మ‌ల్ హాస‌న్. త‌ను ముఖ్య‌మంత్రిగా మ‌రింత స‌క్సెస్ కావాల‌ని, త‌మిళ ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా చూడాల‌ని కోరారు.