newsseals.com
News

కోల్ క‌తా చేతిలో ఓడి పోవ‌డం బాధాక‌రం

VijayaBhaskar May 21, 2026
newsseals-RohitSharma
Spread the love

భావోద్వేగానికి లోనైన రోహిత్ శ‌ర్మ

కోల్ క‌తా : ఐపీఎల్ మెగా టోర్నీలో త‌మ పేల‌వ‌మైన  ప్ర‌ద‌ర్శ‌న  త‌న‌ను ఎంత‌గానో బాధ ప‌డేలా చేసింద‌న్నాడు మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌. లీగ్ మ్యాచ్ లో భాగంగా కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ముంబై తో పాటు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కూడా చేతులెత్తేసింది. అడ‌పా ద‌డ‌పా గెలిచినా ఆ త‌ర్వాత ఆశించిన మేర రాణించ‌లేక పోయింది. దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ ఎందుక‌నో ముంబై ఇండియ‌న్స్ పూర్తిగా నిరాశ‌కు గురి చేసింది.

ఇక మ్యాచ్ ఓడి పోయిన అనంత‌రం మీడియాతో మాట్లాడాడు  రోహిత్ శ‌ర్మ‌. ఇది మాకు మరో నిరాశాజనకమైన సీజన్. ఈ సీజన్ ముంబై ఇండియన్స్‌కు, నాకు కూడా చాలా పేలవంగా సాగింది. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి సీజన్‌లను నేను చాలా అరుదుగా చూశాను. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, జారవిడిచిన క్యాచ్‌లు, ప్రతీదీ సరిగ్గా జరగడం లేదన్నాడు.  అందుకే ఇది చాలా చెడ్డ సీజన్‌గా నిలిచింది. మనం ఈ దశను ఎంత త్వరగా అధిగమిస్తే, మనకు అంత మంచిద‌న్నాడు. చివరి మ్యాచ్ గెలిచి, ఈ టోర్నమెంట్‌ను సానుకూల ముగింపుతో పూర్తి చేస్తామని ఆశిస్తున్నని పేర్కొన్నాడు.