newsseals.com
News

బ్లూ ఎకానమీగా ఆక్వా రంగం ఆభివృద్ధి

VijayaBhaskar May 27, 2026
newsseals-APCM
Spread the love

దృష్టి సారించాల‌న్న సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : ఏపీ సీఎ నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు ఆక్వా రంగానికి సంబంధించి. బ్లా ఎకాన‌మీగా ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయాల‌ని అన్నారు. పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి అవసరమైన రూ.3 కోట్లను తక్షణమే విడుదల చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎం నిర్దేశించారు. ఆక్వా జోన్లలో ఆక్వా సాగు చేసే రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సీడీ అంశంపైనా ముఖ్యమంత్రి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆక్వా రంగానికి యూనిట్‌కు రూ.1.50 చొప్పున విద్యుత్ విద్యుత్ సబ్సీడి ఇస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఇచ్చిన 50 వేల కనెక్షన్లతో పాటు కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న 12,680 ఆక్వా కనెక్షన్లకూ ఈ సబ్సిడీ వర్తింప చేయాలని ఆదేశించారు.

ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,100 కోట్ల ఇస్తోందని తెలిపారు. కొత్తగా ఇచ్చే కనెక్షన్లకు కూడా రూ.188 కోట్ల అదనపు సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుందని వివరించారు. రాష్ట్రంలో సాగవుతున్న 4 లక్షల ఎకరాలు ఆక్వా జోన్ పరిధిలోకి రావాలని సీఎం స్పష్టం చేశారు. ఆక్వా రంగంలో క్వాలిటీ సర్టిఫికేషన్‌తో పాటు ట్రేసబిలిటీ తీసుకు రావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లోనూ చేపల పెంపకం ద్వారా స్థానిక మత్స్యకారుల ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. అలాగే సముద్ర తీరంలో మత్స్యకారులకు 200 మెకనైజ్డ్ బోట్లను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. దీని కోసం రూ.240 కోట్ల మేర వ్యయం అవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. బ్లూ ఎకానమీ దిశగా ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తామని సీఎం స్పష్టం చేశారు.