newsseals.com
News

బుర్రా విజ‌య‌శేఖ‌ర్ కు రామ‌కృష్ణ పుర‌స్కారం

VijayaBhaskar May 31, 2026
newsseals-Tribute
Spread the love

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా గుర్తింపు పొందారు

హైద‌రాబాద్ : సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ శ్రీ జాగర్లమూడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి సంతాప సభ నేడు నగరంలోని ఎస్.ఆర్.నగర్ లో జరిగింది. రామకృష్ణ పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్ బుర్రా విజయశేఖర్ కి అందజేశారు. ఈ సందర్భంగా జాగర్లమూడి రామకృష్ణ వార్తలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కె.నారాయణ మూర్తి, డాక్టర్ అంబటి సురేంద్ర రాజు, కొల్లి అరవింద్, వేణుగోపాల్, రాధాకృష్ణ, ఎం.సాగర్ కుమార్, బి.రాములు, ప్రముఖ సామాజిక నేత, అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపక కార్యదర్శి జ్ఞానేశ్వర్, డాక్టర్ నాగరాజ్, కె.ఎన్.ఆర్ మహర్షి, శ్రీ జాగర్లమూడి రామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు మరిశెట్టి మురళీ కుమార్ లతో పాటు అనేక మంది జర్నలిస్టులు పాల్గొని జాగర్లమూడి రామకృష్ణకు శ్రద్ధాంజలి ఘటించారు.