newsseals.com
News

ఎస్వీ ప్రాచ్య కళాశాలలో ప్రవేశాల సందడి

VijayaBhaskar June 6, 2026
newsseals-TTDAdmissions
Spread the love

కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించ బడుతున్న శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయ సంస్కృతి, సాహిత్యం, భాషా వైభవాన్ని అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని కళాశాల యాజమాన్యం తెలిపింది. బి.ఏ. (ఓ.ఎల్.) డిగ్రీ కోర్సులో తెలుగు, సంస్కృతం, హిందీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ విభాగాలలో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. అలాగే ప్రీ–డిగ్రీ (ఇంటర్‌మీడియట్‌కు సమానం) కోర్సులో సంస్కృతం, తెలుగు, హిందీ విభాగాలలో కూడా అడ్మిషన్లు జరుగనున్నాయి.

ప్రవేశం పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించ బడుతుంది. అదనంగా ఉచిత భోజన వసతి కూడా అందుబాటులో ఉంటుంద‌ని టీటీడీ తెలిపింది. రెండేళ్ల ప్రీ–డిగ్రీ కోర్సులకు 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు అర్హులని పేర్కొంది. మూడేళ్ల డిగ్రీ కోర్సులకు 21 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, ప్రీ–డిగ్రీ, ఇంటర్‌మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. .

జూన్ 17 నుండి సంబంధిత విద్యార్హతల ధ్రువపత్రాలతో కళాశాలలో నేరుగా ప్రవేశాలు పొందవచ్చని తెలిపింది. కె.టి. రోడ్డులోని ఎస్వీ ప్రాచ్య కళాశాల కార్యాలయంలో రూ.25 చెల్లించి దరఖాస్తు ఫారాలు పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 6 లోపు సమర్పించాలని స్ప‌ష్టం చేసింది. మరిన్ని వివరాలకు 9848642346, 6281894208 నంబర్లలో సంప్రదించ వ‌చ్చ‌ని తెలిపింది టీటీడీ.