newsseals.com
ENTERTAINMENT

నాంప‌ల్లి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

Posted by: VijayaBhaskar June 19, 2026
newsseals-NampallyCourt

సంధ్య థియేటర్‌కు సంబంధించిన కేసు పై

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని సంధ్య థియేటర్‌కు సంబంధించిన O.S. No.216 of 2026 లో I.A. No.369 of 2026 కేసులో, హైదరాబాద్ నగర సివిల్ కోర్టు వేకేషన్ సివిల్ జడ్జి-కమ్-XXV అదనపు చీఫ్ జడ్జి 04 జూన్ 2026 తేదీన మధ్యంతర (Ad-Interim Ex Parte Injunction) ఉత్తర్వులు జారీ చేశారు .ఈ ఉత్తర్వుల ప్రకారం, పై కేసుకు సంబంధించిన అంశాలపై కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో, వాస్తవ నిర్ధారణకు ముందుగానే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎటువంటి ఊహాగానాలు, అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలు, వాస్తవాలకు విరుద్ధమైన చర్చలు, డిబేట్లు, వార్తా కథనాలు లేదా సోషల్ మీడియా పోస్టులు ప్రచురించడం లేదా ప్రసారం చేయరాదని కోర్టు ఆదేశించింది.

అందువల్ల, సంబంధిత మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ ఫారమ్‌లు, సోషల్ మీడియా వేదికలు , ప్రజలు న్యాయస్థానం జారీ చేసిన ఈ ఉత్తర్వులను గౌరవించి, కేసుకు సంబంధించిన నిర్ధారణ కాని సమాచారాన్ని ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది నాంప‌ల్లి కోర్టు. ఇదిలా ఉండ‌గా ఇవాళ సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు ప్ర‌ముఖ న‌టుడు అల్లు అర్జున్ కు స‌మ‌న్లు జారీ చేసింది.