newsseals.com
DEVOTIONAL

శ్రీ పద్మావతి స‌న్నిధిలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్

Posted by: VijayaBhaskar June 22, 2026
newsseals-TelanganaGovernor


కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్న శుక్లా

తిరుప‌తి : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లా, కుటుంబ సభ్యుల తో కలిసి తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని గవర్నర్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ విశిష్టతను కొనియాడారు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కాగా గవర్నర్ సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.. అనంతరం శ్రీకాళహస్తి ఆలయంకు వెళ్లి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సంద‌ర్శించారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి సాద‌రంగా స్వాగ‌తం ప‌లికింది. ప్రోటోకాల్ స‌మ‌యంలో త‌న‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించింది.