newsseals.com
ENTERTAINMENT

సమంత ‘మా ఇంటి బంగారం’ అద్భుతం

VijayaBhaskar July 4, 2026
newsseals-AkhilAkkineni

హైద‌రాబాద్ : నేష‌న‌ల్ క్ర‌ష్ న‌టి స‌మంత రుత్ ప్ర‌భు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు. త‌ను నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం చిత్రం అద్భుత విజ‌యాన్ని సాధించింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రూ. 60 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇంకా ఈ చిత్రాన్ని జ‌నం ఆద‌రిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. ఇటీవ‌లి కాలంలో తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విడుద‌లైన సినిమాల కంటే భిన్నంగా మా ఇంటి బంగారం రూపుదిద్దుకుంది. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన స‌మంత రుత్ ప్రభు అద్భుత‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించింది. త‌ను చేసిన ఫైటింగ్ సీన్స్ మ‌హిళ‌ల‌ను కంట త‌డి పెట్టించేలా చేశాయి. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. త‌న కుటుంబం కోసం తను క‌ష్ట‌ప‌డిన తీరు , తీసిన విధానం ప్ర‌తి ఒక్క‌రినీ సినిమాను చూసేలా చేశాయి.

ఈ సంద‌ర్బంగా మా ఇంటి బంగారం స‌క్సెస్ కావ‌డంలో స‌మంత రుత్ ప్ర‌భు కీల‌కంగా మారార‌ని, ఆమె న‌ట‌న‌ను చూసి తాను ఆశ్చ‌ర్యానికి లోనైన‌ట్లు అఖిల్ అక్కినేని పేర్కొన్నారు. త‌ను ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘లెనిన్’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు . ఈ చిత్రం జూలై 10, 2026న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఒక ప్రచార కార్యక్రమంలో, సమంత నటించిన ఇటీవలి చిత్రం ‘మా ఇంటి బంగారం’ గురించి అఖిల్‌ను అడిగారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నటుడు ఇలా అన్నారు. నా స్వంత సినిమా ప్రచార కార్యక్రమాల వల్ల నేను ఇంకా ఆ సినిమా చూడలేక పోయాను, కానీ ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ చూశాను. అది నాకు చాలా నచ్చింది.

ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకు అనిపించింది. ఇందులో స‌మంత రుత్ ప్ర‌భు అందరి మనసులను గెలుచుకుని, వారి కుటుంబానికి నిజమైన ‘బంగారం’లా నిలిచే కోడలి పాత్రలో నటించింది. ఇది నిజంగా చాలా మంచి, శక్తివంతమైన యాక్షన్ డ్రామా. ఒక మహిళ అటువంటి యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చేయడం చాలా ప్రత్యేకమైన విషయం. త‌న‌తో పాటు చిత్ర బృందానికి అభినంద‌లు తెలియ చేశారు అఖిల్ అక్కినేని.