newsseals.com
News

2027 నాటికి 72,70,605 పాసు పుస్త‌కాలు

VijayaBhaskar July 9, 2026
newsseals-APCM

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇదో ఉద్యమంగా, పవిత్రమైన కార్యక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపడుతున్నాం అన్నారు. 2027 మార్చి నాటికి 9833 గ్రామాల్లో 72,70.,605 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఏపీని ఎలాంటి భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. విలేజ్ ఇనామ్ భూములను కూడా 22ఏలో పెట్టేశారన్నారు. వీటిని 1971 గ్రామాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశాం అని తెలిపారు. ఆటో మ్యూటేషన్ ద్వారా వారసత్వ ఆస్తుల్ని సంబంధిత వ్యక్తులకు చెందేలా చేస్తున్నాం అన్నారు. తిరుపతి జిల్లా శెట్టిపల్లి, గుంటూరులోని వట్టి చెరుకూరు, చిత్తూరు జిల్లా కంగుందిలో చాలా ఏళ్లుగా ఉన్న భూవివాదాలను పరిష్కరించామ‌ని వెల్ల‌డించారు. డోన్ నియోజకవర్గంలో ఉన్న 2,074 ఎకరాల వక్ఫ్ భూముల్ని కూడా 22ఏలో గత పాలకులు పెట్టార‌న్నారు.

ఆ భూముల్ని 22ఏ జాబితా నుంచి తొలగించి రైతుల సమస్యల్ని పరిష్కరించాం అని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల్ని పరిష్కరించటంతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి పని చేస్తున్నాం అని పేర్కొన్నారు. రాయలసీమ ముఖ చిత్రాన్ని మారుస్తున్నాం అన్నారు. కడప స్టీల్ ప్లాంట్, హీరో మోటార్స్, అమ్కా డిఫెన్స్ ఫైటర్ జెట్ ప్లాంట్ ఏర్పాటు అవుతోందన్నారు సీఎం. రాయలసీమలో తయారైన ఎన్ ఫీల్డ్ బుల్లెట్ లు దేశమంతా తిరుగుతాయని చెప్పారు. రూ.40 వేల కోట్లు ప్రభుత్వ పెట్టుబడులు, రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమ హార్టీ కల్చర్ హబ్‌గా మారుతోంద‌న్నారు.