newsseals.com
News

స్టీల్ ప్లాంట్ పేరుతో గనులు దోచుకున్నారు

VijayaBhaskar July 11, 2026
newsseals-APCM

అమ‌రావ‌తి : సొసైల్ మీడియాలో తప్పుడు పోస్టులు, వ్యక్తిత హనన పోస్టుల కట్టడికి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుపై ఇంకా వర్క్‌వుట్ చేస్తున్నామని వివరించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. సోషల్ మీడియాను సమాజానికి పనికొచ్చే విధంగా కాకుండా వ్యక్తిత్వ హననాలకు ఉపయోగించడంతో పాటు, మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఇలాగే వదిలేస్తే సమాజానికి చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. దీని కారణంగా మహిళలు స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితి ఉండదన్నారు. బ్రహ్మణీ స్టీల్ లిమిటెడ్ నుంచి ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకున్న అంశంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.

ఒక వ్యక్తి అవినీతి దాహానికి లక్షల కోట్ల సంపద ఆవిరైందని వ్యాఖ్యానించిన సీఎం… స్టీల్ ప్లాంట్ పేరుతో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారన్నారు. బ్రహ్మణీ స్టీల్ ప్లాంట్ కు కేటాయించిన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుందని, అయితే ఓబులాపురం మైనింగ్ అంశం ఇంకా ముగియలేదని అన్నారు. వైసీపీ అధినేత జగన్ నైజాన్నీ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. హిట్, రన్ అండ్ ఎస్కేప్ గొడ్డలి పార్టీ నైజమని, ఇక్కడ ఏదో ఒకటి చేయించడం, వెళ్లి పక్కరాష్ట్రంలోని బెంగళూరులో ఉండటం అలవాటైందన్నారు. ‘‘ప్రభుత్వాన్ని, పార్టీ నేతల్ని టార్గెట్ చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సైకో మనస్తత్వంతోనే తెలంగాణలో ఆరుగురు హత్యకు గురయ్యారు. పొక్సో కేసు పెట్టారని బాధితురాలు, వారి కుటుంబాన్ని, కోపరేట్ చేయలేదని సొంత కుటుంబాన్ని హత్య చేశాడు. సొంత బాబాయిని చంపడం, కన్న తల్లి, సొంత చెల్లి వ్యవహారాల్లో జగన్ వైఖరి ఏంటో అంతా చూశాం. గొడ్డలి పార్టీ అధినేతకు, తెలంగాణలోని హంతకుడి మనస్తత్వానికి దగ్గర పోలికలు ఉన్నాయన్నారు సీఎం.