newsseals.com
News

ఈశ్వ‌ర‌మ్మ యాద‌వ్ పై శివ చ‌ర‌ణ్ రెడ్డి బూతు పురాణం

VijayaBhaskar July 12, 2026
newsseals-JakkidiShivaCharanReddy

యాదాద్రి న‌ల్ల‌గొండ జిల్లా : తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా యాద‌గిరిగుట్ట ఆల‌యానికి సంబంధించి పాల‌క మండ‌లిని ఖ‌రారు చేసింది. ఇప్ప‌టికే తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది సర్కార్. త‌న‌కు తెలియ‌కుండానే క‌మిటీని ఎంపిక చేశారంటూ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎవ‌రికీ తెలియ‌కుండా, ఎవ‌రినీ సంప్ర‌దించ‌కుండానే త‌మ‌కు కావాల్సిన వారికి ప‌ద‌వులు క‌ట్టబెట్ట‌డం క‌ల‌క‌లం రేపింది. విచిత్రం ఏమిటంటే ఏనాడూ యాద‌గిరిగుట్ట న‌ర‌సింహ స్వామిని ద‌ర్శించుకోని చిరంజీవి భార్య సురేఖ‌కు ఇందులో చోటు క‌ల్పించారు సీఎం రేవంత్ రెడ్డి.

ఈ త‌రుణంలో బీసీ మహిళ నాయకురాలు, యాదగిరిగుట్ట పాలకమండలి సభ్యురాలైన‌ ఈశ్వరమ్మ యాదవ్ పై తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివ చరణ్ రెడ్డి బూతు మాట‌ల‌తో రెచ్చి పోయాడు. మా నాన్న ఫోటో ఫ్లెక్సీలో పెట్టారా అంటూ, ఈశ్వరమ్మ యాదవ్ పై బూతులతో ఊగి పోయాడు . ఈశ్వరమ్మ యాదవ్ బోసిడి ముండ అంటూ, అగౌరపరిచిన ఆడియో విడుదల చేశాడు. ఈశ్వరమ్మ యాదవ్ అంతు చూస్తానంటూ, అతనిపై రాహుల్ గాంధీ కైనా, సీఎం రేవంత్ రెడ్డి కైనా, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కైన స్థానిక నాయకుడు మధు యాష్కీకి ఫిర్యాదు చేసుకోవచ్చని సవాల్ విసిరాడు. దీనిపై మ‌హిళ అని చూడ‌కుండా ఇలాంటి కామెంట్స్ చేసిన స‌ద‌రు రెడ్డి నిర్వాకంపై బీసీ సంఘాలు , నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.