newsseals.com
News

రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

VijayaBhaskar July 15, 2026
newsseals-HYDRAA

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. తాజాగా మేడ్చల్ – మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచెర్ల గ్రామం, జయప్రద కాలనీలో ప్రజా వినియోగం కోసం కేటాయించిన 4,400 గజాల భూమిని HYDRAA (హైద్రా) రక్షించింది. ఇందులో పార్కు కోసం 1,200 గజాలు, షాపింగ్ కాంప్లెక్స్ కోసం 1,200 గజాలు, ఆలయాల కోసం 400 గజాలు, పాఠశాల , గ్రంథాలయం కోసం 800 గజాలు, అలాగే నీటి ట్యాంక్ కోసం 800 గజాల స్థలం ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ కోసం కేటాయించిన భూమిని నివాస స్థలాలుగా (ప్లాట్లుగా) మార్చడంపై జయప్రద కాలనీ వాసులు ఆందోళన చెందారు .

దీనివల్ల అప్పటికే అక్కడ రెండు ఇళ్ల నిర్మాణం కూడా జరిగింది. నిరంతరం జరుగుతున్న ఆక్రమణల పట్ల కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ HYDRAAకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన HYDRAA అధికారులు సంబంధిత సిబ్బందితో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించి, ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారించారు. తదనుగుణంగా పార్కుతో సహా ప్రజా వినియోగ స్థలాలను రక్షించేందుకు హైడ్రా అక్కడ కంచెను ఏర్పాటు చేసింది. అలాగే, అక్కడ సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. HYDRAA రక్షించిన ఈ భూమి విలువ సుమారు రూ. 25 కోట్లు ఉంటుందని అంచనా. ఈ సంద‌ర్బంగా హైడ్రాకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.