newsseals.com
DEVOTIONAL

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్యం కోసం శ్రీ‌వారికి విన్న‌పం

VijayaBhaskar July 18, 2026
newsseals-PawanKalyanWife

తిరుమ‌ల : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటూ తిరుమ‌ల‌ను సంద‌ర్శించారు త‌న భార్య అన్నా లెజ్ నోవా. ప‌వ‌న్ కు ఇటీవ‌లే ముంబైలో భుజానికి శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. మూడు వారాల పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించారు. డిశ్చార్జి అయిన డిప్యూటీ సీఎం నేరుగా హైద‌రాబాద్ లో ఉన్న త‌న నివాసానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా త‌న భ‌ర్త‌కు విజ‌య‌వంతంగా ఆప‌రేష‌న్ కావాల‌ని , అలా జ‌రిగితే తాను తిరుమ‌ల‌లో కొలువు తీరిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకుంటాన‌ని మొక్కుకున్నారు అన్నా లెజ్ నోవా.

ఈ సంద‌ర్బంగా భ‌ర్త ఆరోగ్యం కోసం నిత్యం పూజ‌లు చేస్తూ వ‌స్తోంది. అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ శ్రీవారి చెంతకు చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. చివరి మెట్టు వద్ద కొబ్బరి కాయ కొట్టారు. అనంతరం నేరుగా వరాహస్వామి ఆలయంకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేశారు. గతంలో కూడా మెట్ల మార్గంలో నడుచుకుంటూ వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు పవన్ సతీమణి. తల నీలాలు కూడా సమర్పించారు .తన కుమారుడు స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో స్వల్ప గాయాలతో బయట పడడంతో శ్రీవారి చెంతకు అలిపిరి నుండి నడుచుకుంటూ వెళ్లి.. తలనీలాలు సమర్పించి, మొక్కు తీర్చుకున్నారు.