గ్రూప్ -1 ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాలి : బీఆర్ఎస్వీ

తిరిగి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆందోళ‌న

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో నిర్వ‌హించిన గ్రూప్ -1 ప‌రీక్ష‌లు పూర్తిగా లోప‌భూయిష్టంగా ఉన్నాయ‌ని, వెంట‌నే ర‌ద్దు చేసి తిరిగి నిర్వ‌హించాల‌ని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వ‌ర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోని ఉస్మానియా యూనివ‌ర్శిటీ లోని లైబ్ర‌రీ బిల్డింగ్ వ‌ద్ద పెద్ద ఎత్తున నిర‌స‌న చేప‌ట్టారు అభ్య‌ర్థులు. ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు రాష్ట్ర హైకోర్టు ఇచ్చింద‌ని, అయినా మొండిగా కాంగ్రెస్ స‌ర్కార్, సీఎం రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు ఆందోళ‌న‌కారులు. కోట్ల రూపాయ‌లు చేతులు మారాయ‌ని, వేలాది మంది ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారంటూ వాపోయారు బాధిత అభ్య‌ర్థులు.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కు ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు చైర్మ‌న్లు మారార‌ని అయినా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లోనూ ఎలాంటి మార్పులు తీసుకు రాలేక పోయార‌ని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఇందులో పెద్ద ఎత్తున అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని, సిట్టింగ్ జ‌డ్జితో లేదా సీబీఐతో న్యాయ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. ఒకే గ‌దిలో ప‌రీక్ష‌లు రాసిన అభ్య‌ర్థుల‌కే జ‌న‌ర‌ల్ ర్యాంకులు వ‌చ్చాయ‌ని దీనిపై త‌మ‌కు అనుమానం ఉంద‌ని పేర్కొన్నారు. కొన్నేళ్ల పాటు గ్రూప్ -1 కోసం క‌ష్ట‌ప‌డి చ‌దివి రాస్తే , తెలుగు మీడియం అభ్య‌ర్థుల‌కు తీవ్రంగా అన్యాయం జ‌రిగింద‌ని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. దీనికంతటికి సీఎం , స‌ర్కారే కార‌ణ‌మ‌ని ఆరోపించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *