బుక్ ఎగ్జిబిష‌న్ కోసం సీఎంకు ఆహ్వానం

విజ‌య‌వాడ‌లో జ‌న‌వ‌రి 2 నుంచి 7 వ‌ర‌కు

అమ‌రావ‌తి : దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విజయవాడ బుక్ ఎగ్జిబిషన్‌కు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆహ్వానించింది. 2026 జనవరి 2 నుంచి 7 వరకు ఈ 36వ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దక్షిణ భారత దేశంలోని పుస్తక పబ్లిషర్లు, ప్రింటర్లు, పాఠకులు పెద్దఎత్తున హాజరు కానున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. అందరిలో పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగేలా బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించటంపై బుక్ ఫెస్టివల్ సొసైటీని సీఎం అభినందించారు. పుస్త‌కాలు చ‌ద‌వడం ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో భాగంగా కావాల‌ని ఈ సంద‌ర్బంగా ఆకాంక్షించారు.

ప్రభుత్వం ప్ర‌త్యేకించి గ్రంథాల‌యాల‌కు ప్ర‌యారిటీ ఇస్తోంద‌న్నారు. ఈసంద‌ర్బంగా బుక్ ఎగ్జిబిష‌న్ ను నిర్వ‌హించ‌డం త‌న‌కు సంతోషం క‌లిగించింద‌న్నారు. ఓ వైపు సాంకేతికత కొత్త పుంత‌లు తొక్కుతున్నా ఎక్క‌డా పుస్త‌కాల ప్రాధాన్య‌త పెరుగుతోందే త‌ప్పా త‌గ్గ‌డం లేద‌న్నారు. రాను రాను పుస్త‌కాలు చ‌దివే వారి సంఖ్య పెరుగుతోంద‌న్నారు. ఇది మ‌రింత త‌న‌ను కూడా చ‌దివిలే చేసింద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇదిలా ఉండ‌గా సీఎం ను కలిసిన వారిలో సొసైటీ అధ్యక్షుడు టి.మనోహర్ నాయుడు, ఏపీ ప్రింటర్లు, పబ్లిషర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కాట్రగడ్డ మోహన్ ,తదితరులు ఉన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *