ప‌త్తి రైతుల‌ను ఆదుకోవాలి : క‌విత

స‌ర్కార్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ

ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కాంగ్రెస్ స‌ర్కార్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆరుగాలం పండించే రైతుల‌ను ఆదుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌ధానంగా ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా పెద్ద ఎత్తున న‌ష్ట పోయార‌ని వాపోయారు. ప్ర‌ధానంగా ప‌త్తి పంట దెబ్బతింద‌ని పేర్కొన్నారు. జాగృతి జ‌నం బాట‌లో భాగంగా క‌విత ప్ర‌స్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మార్కెట్ యార్డులో అమ్మ‌కానికి తీసుకు వ‌చ్చిన ప‌త్తిని ప‌రిశీలించారు. రైతుల‌తో ముచ్చ‌టించారు. వారి బాధ‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

పత్తి రైతుల దుస్థితి దారుణంగా ఉంద‌న్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. అకాల వర్షాలు అధిక తేమ స్థాయిలకు కారణమయ్యాయని వాపోయారు. 12% కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయడానికి కాట‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా నిరాకరిస్తోందన్నారు. దీనివల్ల రైతులు ట్రాక్టర్ లోడ్‌కు దాదాపు ₹50,000 నష్ట పోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు క‌విత‌. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 20–25% తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన బిజెపి ఎంపీ, ఎమ్మెల్యే కేంద్రానికి లేఖ రాసి మన రైతులకు అండగా నిలబడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు క‌విత‌. పత్తి తేమగా, అచ్చుగా లేదా మొలకెత్తినందునే నెపంతో ప‌క్క‌న పెడితే ఎలా అని ప్రశ్నించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *