నారా లోకేష్ ప్ర‌జా దర్బార్

బాధితుల‌కు మంత్రి భ‌రోసా

అమ‌రావ‌తి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌వారం మంగ‌ళగిరి లోని క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌జా ద‌ర్బార్ నిర్వహించారు. ఆయ‌న ఎన్నికైన నాటి నుంచి ఈ కార్య‌క్ర‌మం నిరాటంకంగా కొన‌సాగుతోంది. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తులు స్వీక‌రించ‌డం, ఆయా స‌మ‌స్య‌ల‌ను గుర్తించ‌డం, సంబంధిత మంత్రులు, ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు, జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు పంపించేలా చేస్తున్నారు. దీంతో త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నారా లోకేష్ వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు జ‌నం. తాను ఎన్నిక‌ల సంద‌ర్బంగా పెద్ద ఎత్తున జ‌నం బాట కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఇదే రీతిన అధికారంలోకి వ‌చ్చాక కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ మేర‌కు ప్ర‌తి వారంలో ఒక రోజు ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు మంత్రి నారా లోకేష్‌. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో 72వ రోజు ప్రజాదర్బార్ చేప‌ట్టారు. మంత్రిని కలిసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు తరలి వచ్చారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి, సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు నారా లోకేష్. ఈ కార్య‌క్ర‌మం కంటిన్యూగా కొన‌సాగుతుంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లు ఎవ‌రైనా స‌రే నిర్భ‌యంగా త‌మ బాధ‌లు చెప్పుకునే వీలు క‌లుగుతుంద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *